telugu matladudam
Sunday 12 April 2015
Sunday 21 September 2014
రాత్రి
ఆ రాత్రి ,
నేను దాటివచ్చిన జీవితపు దారిలో,
నేను పారేసుకున్న ఎన్నో నిండు గ్రీష్మాల
జ్ఞాపకాల పూవులను ఏర్చి ,కుర్చుకుంటున్నాను .
ఆ రాత్రి ,
ఆకాశం లో చుక్కలు చలికి మేఘాల దుప్పటి
కప్పుకుని తొంగి చూస్తుంటే ,
తూర్పు కొండలోయలోని మిణుగురులు
ఆకాశాన్నంటి చుక్కలవుతున్నాయి .
ఆ రాత్రి ,
కుక్క అరుపుకు కీచురాళ్ళు తోడై
జంటస్వరాల గాత్రం చేస్తుంటే ,
వెన్నెల గాలికి ముంగురులు
ముఖం మీద తాళం తప్పకుండ నాట్యం చేస్తుంటాయి .
ఆ రాత్రి ,
మగతలోని మనసు అటునుంచి ఇటు,
అటునుంచి ఇటు మేత్తగిల్లి నిద్దరోతోంది ,
ఆ నిద్రలో తిరిగి నిండు గ్రీష్మాల జ్ఞాపకాల పూవులను
ఏర్చి కుర్చుతునే ఉంటుంది .
ఆ రాత్రి ,
గతం లోని ఎన్నో తప్పులకు ,
శిక్ష అనే మెరుపు కోరాడ ఝులిపిస్తుంటే ,
మనసులోని పశ్చాత్తాప మేఘాలు కరుగుతుంటాయి ,
కండ్ల వెంబడి కుండపోత కన్నీటివర్షం కురుస్తుంటుంది .
ఆ రాత్రి ,
నా జ్ఞాపకాల పూవులలో ,
కభంద హస్తాలలో నలిగిన ఎన్నో పూవులు ,
నా కన్నీటితో జీవం పోయాలని మనసు అరాతపడుతూ ,
నలిగిన కుసుమాలను కుర్చుతుంటుంది .
ఆ రాత్రి , నా మనసు ఎంత ఏరినా కొంత తరుగుఉండే పూవులను ఎరుతునే ఉంటుంది ,
ఆ రాత్రి అలా తెల్లవారుతూ ఉంటుంది మరో వెన్నెల రేయి కోసం .
Friday 22 August 2014
. తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
దెలుగు వల్లభుండ దెలుగొకండయెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స.
అందుకే నాది తెలుగు జాతి అని గర్వం గా చెప్పుకుంటాను ,
నా అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాను .
మీరు కుడా గర్వం గా చెప్పగల్గితే ఒక్క ఒక్క లైక్ కొట్టండి .
చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయో , ఎంతమంది అసలైన తెలుగు వారున్నారో .
శ్రీ .
Wednesday 13 August 2014
ఓ స్వరం ,
ఓ ప్రియమైన స్వరం ,
నా హ్రుదయాన్తరాలలోని నా బాల్యం నా పెదవులపై చిరునవ్వులు మేరిపించినప్పుడల్లా జ్ఞప్తికి వచ్చే ఆ స్వరం ,
నా స్నేహ స్వరం ,
అమ్మ కోపగించినప్పుడు ఇంటి చీకటి ములలో నన్ను ఓదార్చే స్వరం ,
పొలం లో నాన్న నేర్పే రాగాలకు తోడి రాగం అయిన స్వరం ,
వెన్నెల రాత్రులలో అల్లుకునే అందమైన కలలకు కళలు నేర్పే స్వరం ,
ఓ ప్రియమైన స్వరం ,
నా హ్రుదయాన్తరాలలోని నా బాల్యం నా పెదవులపై చిరునవ్వులు మేరిపించినప్పుడల్లా జ్ఞప్తికి వచ్చే ఆ స్వరం ,
నా స్నేహ స్వరం ,
అమ్మ కోపగించినప్పుడు ఇంటి చీకటి ములలో నన్ను ఓదార్చే స్వరం ,
పొలం లో నాన్న నేర్పే రాగాలకు తోడి రాగం అయిన స్వరం ,
వెన్నెల రాత్రులలో అల్లుకునే అందమైన కలలకు కళలు నేర్పే స్వరం ,
నా జీవితం అనే పుస్తకం లో ఎంతో పదిలం గా దాచుకున్న అందమైన జ్ఞాపకాలలో అనునిత్యం తొంగి చూసే ఆ "కీచురాళ్ళ" స్వరం .
Tuesday 12 August 2014
నిత్య పరిచితమైన దారి ,
అనునిత్యం సుపరిచితిలైన వ్యక్తులు ,
ఆ దారి లో ఆ సుపరిచితులని దాటి పోతుండగా
నన్ను తాకింది ఓ కన్నీటి చుక్క ,
రెండు రెప్పల మధ్య దాచాలని ప్రయత్నించిన కన్నీటి సంద్రం ,
తన మాట వినక రెప్ప దాటి బయట పడి ,
ఒక్కిపోయిన చెక్కిలి మీదుగా జారి ,
అవిసిపోయిన గుండెలను తడుపుతున్నపుడు ,
కడుపున పుట్టిన వారి ఆదరణ కరువై
ప్రేమ కోసం ,
ఆప్యాయత కోసం ,
గుప్పెడు మెతుకుల కోసం ,
ఆదరించే చేతుల కోసం ,
ఆత్రం గా ఎదురుచూసే ఆ తడిచిన కన్నుల నుంచి జారిన ఆ కన్నీటి చుక్క నన్ను వెంటాడుతూనే ఉన్నది .
ఓ కన్నీటి చుక్క
అనునిత్యం సుపరిచితిలైన వ్యక్తులు ,
ఆ దారి లో ఆ సుపరిచితులని దాటి పోతుండగా
నన్ను తాకింది ఓ కన్నీటి చుక్క ,
రెండు రెప్పల మధ్య దాచాలని ప్రయత్నించిన కన్నీటి సంద్రం ,
తన మాట వినక రెప్ప దాటి బయట పడి ,
ఒక్కిపోయిన చెక్కిలి మీదుగా జారి ,
అవిసిపోయిన గుండెలను తడుపుతున్నపుడు ,
కడుపున పుట్టిన వారి ఆదరణ కరువై
ప్రేమ కోసం ,
ఆప్యాయత కోసం ,
గుప్పెడు మెతుకుల కోసం ,
ఆదరించే చేతుల కోసం ,
ఆత్రం గా ఎదురుచూసే ఆ తడిచిన కన్నుల నుంచి జారిన ఆ కన్నీటి చుక్క నన్ను వెంటాడుతూనే ఉన్నది .
ఓ కన్నీటి చుక్క
Saturday 12 July 2014
మరపు
ప్రియ ........,
మరువమని చెప్పావు నువ్వు,
యదలో మ్రోగెను నీ చిరునవ్వు ,
నిన్ను మురచుట నాతరమా ,
నన్ను మరచుట నీ తరమా ?
ప్రియ ......,
నీవు అల్లిన ప్రేమ లతలలో ,
చిక్కు పడెను నా మనసు నీ వలపులలో.
చేసుకున్నాము ప్రేమ బాసలు కలలో ,
నేడు వీడినాయి మన జీవితాలు ఇలలో .
ప్రియ ......,
నాడు అన్నావు మన కలయిక ఒక వరమని ,
నేడు అంటున్నావు అదంతా ఒక కలయని .
నాడు అన్నావు నా చేయి విడువనని ,
నేడు అంటున్నావు నన్ను మరువమని ......
కాని ......,
అది సాధ్యమా .....?
చెప్పు ఒక మాట సాధ్యమని ,
గ డిపేస్తాను ఈ జీవితాన్ని మరు జన్మ లో నీ సాన్నిధ్యం కోసమని
ఎదురుచూస్తూ
ఇట్లు
నీ ప్రేమ కోసమై ఎదురు చూసే ఓ ఆశా జీవి .
ప్రియ ........,
మరువమని చెప్పావు నువ్వు,
యదలో మ్రోగెను నీ చిరునవ్వు ,
నిన్ను మురచుట నాతరమా ,
నన్ను మరచుట నీ తరమా ?
ప్రియ ......,
నీవు అల్లిన ప్రేమ లతలలో ,
చిక్కు పడెను నా మనసు నీ వలపులలో.
చేసుకున్నాము ప్రేమ బాసలు కలలో ,
నేడు వీడినాయి మన జీవితాలు ఇలలో .
ప్రియ ......,
నాడు అన్నావు మన కలయిక ఒక వరమని ,
నేడు అంటున్నావు అదంతా ఒక కలయని .
నాడు అన్నావు నా చేయి విడువనని ,
నేడు అంటున్నావు నన్ను మరువమని ......
కాని ......,
అది సాధ్యమా .....?
చెప్పు ఒక మాట సాధ్యమని ,
గ డిపేస్తాను ఈ జీవితాన్ని మరు జన్మ లో నీ సాన్నిధ్యం కోసమని
ఎదురుచూస్తూ
ఇట్లు
నీ ప్రేమ కోసమై ఎదురు చూసే ఓ ఆశా జీవి .
Subscribe to:
Posts (Atom)